Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి  

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకి, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కళ్ళేపు కృష్ణ అన్నారు. ఆలేర్ పట్టణంలో మంగళవారం బీసీ సంఘ సమావేశం ఆర్యవైశ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, బీసీల బ్రతుకు మారలేదన్నారు. చట్టసభలతో  బీసీలకు ఏ పార్టీలు అవకాశం కల్పిస్తారో, వాళ్ళకే మేము ఓట్లు వేస్తామాని చెప్పారు. బీసీ మంత్రి కేంద్రంలో లేనటువంటి పరిస్థితి మారాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం అవకాశం కల్పిస్తామని, అమలు చేయలేదన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం పేరుతో , బీసీలకు న్యాయం జరగకుండా హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం బీసీ సంఘం నూతన కమిటీని ఎనుకున్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులుగా పోతు ప్రవీణ్, ఉపాధ్యక్షులు చౌడబోయిన పరశురాములు, కార్యదర్శిగా  గొట్టిపాముల శ్రీనివాసరాజు , మహిళా విభాగం మండల అధ్యక్షురాలుగా మాటూరు జానమ్మ, పేరేపు రాములు, చింతకింది రామాంజనేయులు, చౌడబోయిన కనకయ్య, చౌడబోయిన పరశురాములు, బొడ్డ ఆంజనేయులు, సభ్యులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -