దోస, నిమ్మరసం
నిమ్మరసంలో మంచి బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. దీనిని అప్లై చేయడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. అయితే, దీనిని నేరుగా రాయొద్దు. అందులో కొద్దిగా దోస రసం, చిటికెడు పసుపు కలిపి రాయండి. నిమ్మరసం మరీ ఎక్కువగా వాడకూడదని గుర్తుంచుకోండి.
విటమిన్ ఇ ఆయిల్
విటమిన్ ఇ అనేది మంచి పోషకం. దీనిని మనం బ్యూటీ ప్రోడక్ట్స్‌లో వాడతాం. విటమిన్ ఇ ఆయిల్‌ని వాడడం వల్ల సమస్య తగ్గుతుంది. అయితే, నేరుగా రాయొద్దు. ఇందులో కొద్దిగా కొబ్బరినూనె, ఆలివ్ నూనెని కలిపి ఆ తర్వాత నిదానంగా వేళ్లతో మసాజ్ చేయండి.
మంచి నిద్ర
నిద్రలేకపోవడం వల్ల మీ కళ్ల కింద ఉబ్బరం, నల్లని వలయాలు ఏర్పడతాయి. కాబట్టి, రోజూ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి.
అలర్జీలు తగ్గించుకోండి
చాలా మందికి సీజనల్‌గా చాలా అలర్జీలు వస్తుంటాయి. దీని వల్ల కూడా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ముక్కు దిబ్బడని ప్రేరేపించే అలర్జీలు ఉంటే తుమ్ములు, ముక్కు కారడం వంటి లక్షణాలు తగ్గించేందుకు ట్రై చేయండి. దీంతో కళ్లు ఎర్రబడడం, వాపు ఉంటాయి. వీటన్నింటిని తగ్గిస్తే సమస్య దూరమవుతుంది.
కండ్ల చుట్టూ నల్లమచ్చలా….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


