Wednesday, July 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రిటన్ లో భారతీయ మంత్రి

బ్రిటన్ లో భారతీయ మంత్రి

- Advertisement -

లండన్ : బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే తన కొత్త క్యా బినెట్‌ను ప్రకటించారు. కింగ్ చార్ల్స్ ఆహ్వానం మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బర్న్‌హామ్, మాజీ ప్రధాని కీర్ స్టార్‌మర్ ప్రభుత్వంలో ఉన్న పలువురు కీలక మంత్రులను తప్పిస్తూ కొత్త బృందాన్ని ఖరారు చేశారు. అందులో భారత్ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. క్యాబినెట్ హోదాతో కూడిన కృత్రిమ మేధ (ఏఐ) మంత్రిగా కనిష్క నాారాయణ్కు పదోన్నతి కల్పించారు. స్టార్మర్ ప్రభుత్వంలో జూనియర్ ఏఐ మంత్రిగా పనిచేశారు. ఆన్‌లైన్ భద్రత, కృత్రిమ మేధ విభాగాన్ని పర్యవేక్షించే వారు. ఇప్పుడు పూర్తి స్థాయి క్యాబినెట్ ఏఐ మంత్రిగా హోదా లభించింది. విధానాల రూపకల్పనలో ఏఐకి మరింత కీలకపాత్ర ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ఆయన ఏఐ శాఖతో పాటు కేబినెట్ కార్యాలయం, వ్యాపారం, ఆవిష్కరణలు, విజ్ఞానం, వాణిజ్య శాఖల పరిధిలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -