Wednesday, July 22, 2026
E-PAPER
Homeక్రైమ్అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

హైదరాబాద్‌‌కు చెందిన ముగ్గురు మృతి
భార్య, ఇద్దరు పిల్లలను కోల్పోయిన శాస్త్రవేత్త..
మృతదేహాలను స్వదేశానికి తీసుకురావాలని
ప్రభుత్వాలకు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
నవతెలంగాణ-చార్మినార్

​​అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. సైదాబాద్ డివిజన్ పరిధిలోని వాణినగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళ్తే.. సైదాబాద్‌‌కు చెందిన షేక్ అబ్దుల్ నవీద్‌ దాదాపు 19 సంవత్సరాల కిందట ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని భార్య నజేయా సల్మా (45), కుమార్తె నేహా నహీం షేక్ (19), కుమారుడు ఉమర్ షేక్ (14) అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురు ఒకే కారులో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో షేక్ అబ్దుల్ నవీద్‌తో పాటు ఐదేండ్ల చిన్నారి ఖదీజా తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమా చారం. ఈ విషయం తెలిసిన వెంటనే వాణినగర్ ప్రాంతంలో విషాద వాతావ రణం నెలకొంది. బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో బాధిత ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని షేక్ అబ్దుల్ నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ విజ్ఞప్తి చేశారు. అవసరమైన అన్ని అధికారిక ప్రక్రియలనూ వేగవంతం చేసి, మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించేలా సహకరించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -