Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన మహిళా సమైక్య, అంగన్ వాడీ భవనాలకు శంకుస్థాపన

నూతన మహిళా సమైక్య, అంగన్ వాడీ భవనాలకు శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవనం, అంగన్వాడి కేంద్రం నూతన భవనాల నిర్మాణ పనులకు బుధవారం గ్రామ సర్పంచ్ ముకురాల మోహన్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముకురాల మోహన్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో గ్రామానికి గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమైక్య భవనం, అంగన్వాడి కేంద్రం, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు మంజూరై గ్రామం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. తొలి విడతలో గ్రామానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, రెండో విడతలో కూడా మరిన్ని ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పానం సైదులు, పంచాయతీరాజ్ ఏఈ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్ ఉమాపతి, వార్డు సభ్యుడు బాలు నాగయ్య, మహిళా సమైక్య సీసీ పద్మావతి, వీఏవో శ్రీపతిరావు, అంగన్వాడి టీచర్ జరుపటి శిరీష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -