టీఎస్టి యుఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహులు
నవతెలంగాణ-మిడ్జిల్
కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ రెగ్యులర్ చేయాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు, మండల అధ్యక్షులు వెంకటయ్య డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం భోజనం సమయంలో ముఖ్యమంత్రికి పోస్టు కార్డు ద్వారా సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులను శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుకు తగ్గ వేతనం ఇవ్వాలని, టైం స్కేల్ అమలు చేయాలని, రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరి సెలవులన్నీ వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించాలని విన్నవించారు. హాస్టళ్లకు కేర్ టేకర్లను నియమించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, ఆరోగ్య కార్డులు ఉద్యోగులందరికీ అందించాలని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనియెడల రాబోవు రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ఇన్చార్జి ధనలక్ష్మి ఉపాధ్యాయులు శిరీష, అజిత, విజయలక్ష్మి, అకౌంటెట్ యాదమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



