Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ 11వ వార్షికోత్సవ లోగోను ఆవిష్కరించిన ఐ&పీఆర్‌ ‌స్పెషల్ కమిషనర్‌ ముకుందరెడ్డి

నవతెలంగాణ 11వ వార్షికోత్సవ లోగోను ఆవిష్కరించిన ఐ&పీఆర్‌ ‌స్పెషల్ కమిషనర్‌ ముకుందరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: నవతెలంగాణ 11వ వార్షికోత్సవ లోగోను ఐ&పీఆర్‌ ‌‌స్పెషల్ కమిషనర్‌ ముకుందరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి నవతెలంగాణ పాటుపడుతుందని అన్నారు. ఇదే ఒరవడిని ఇక ముందుకూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. సచివాలయంలోని ఆయన చాంబర్‌లో నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌, ఎడిటర్‌ ఆర్‌.రమేశ్‌లతో కలిసి 11వ వార్షికోత్సవ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్‌ మేనేజర్లు వి.లింగారెడ్డి, కె.రఘు, పి.నరేందర్‌‌రెడ్డి, బోర్డు సభ్యులు బి.బసవపున్నయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -