నవతెలంగాణ-కుభీర్
మండలంలోని సిరిపెల్లి నంబర్ 3 గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. విజయ్ గత పది సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ సర్పంచుగా బాధ్యతలు స్వీకరించి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెంటనే స్తానిక ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడని ఆవేదనతో చెప్పారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ సర్పంచ్ విజయ్ మరణ వార్త తెలియడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఆవేదనకు లోనయ్యారు. ఆయన అంత్యక్రియలు గురువారం ఫకీర్ నాయక్ తండాలో నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



