- తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల శంఖారావం
- మెదక్ రీజియన్ టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్
- రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్
నవతెలంగాణ-సంగారెడ్డి: ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినయం చేయడమే మొదటి లక్ష్యం అని తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లు టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్,రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ టి జే ఎం యు సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి డిపో గౌరవాద్యక్షులు తోపాజి అనతకిషన్ కి ఘణంగా సత్కరించారు.

ఈ సందర్భంగా టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్, మాట్లాడుతూ గతంలో ఈ యు, టీఎంయూ లు అధికారంలో వుండీ సాధించిందేమీ లేదు అని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ త్వరగా జరుగాలంటే కార్మికులు ఈ సారి తప్పకుండా టీజేఎంయును గెలిపించాలని పిలుపు నిచ్చారు.టీజేఎంయూ గౌరవ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూసంగారెడ్డి ఆర్టీసీ టీజేఎంయూను ఘన విజయం సాధింపజేయడమే తన ప్రధాన ధ్యేయమని అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల మేరకు యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. టీజేఎంయూ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హాజరుకావడం సంతోషకరమని, యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంగారెడ్డిలో టీజేఎంయూను విజయపథంలో నడిపిస్తానని తోపాజి అనంత కిషన్ స్పష్టం చేశారు. మెదక్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ఎన్నో ఉద్యమాలు విజయవంతమయ్యాయని, తెలంగాణ ఉద్యమం కూడా అదే ప్రాంతం నుంచి బలపడిందని గుర్తు చేశారు.
అదే స్ఫూర్తితో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగే రాబోయే ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నికల్లో టీజేఎంయూ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు డి వి కే. రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డెమాన్ స్వాములయ్య , చీఫ్ వెస్ ప్రెసిడెంట్ శీనయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలి రవిందర్, రాష్ట్ర కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జీవన్ కొండాపురం , రాష్ట్ర సలహాదారులు రాంచంద్రయ్య , సిటీ రీజినల్ కార్యదర్శి బుల్లెట్ పాండు గారు, మెదక్ రీజియన్ కార్యదర్శి అంజయ్య గౌడ్, సంగారెడ్డి డిపో అధ్యక్షులు మహిందర్, డిపో కార్యదర్శి విక్రమ్, సలహదారులు విఠల్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుకర్, సయ్యోద్దిన్, పబ్లిసిటి సెక్రటరి యం.డి. అశోక్, గ్యారెజ్ సెక్రటరి శ్రావన్, ప్రభాకర్, మోహిన్, ప్రవీణ్ కుమార్, ఐ.ఎస్. రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి, అంజలి, కార్యదర్శి విజయ, స్వరూప, గ్యారేజ్ సెక్రెటరీ కాళిదాస్ ప్రభు, రవిలతో పాటు వివిధ డిపోలలోని తెలంగాణ జాతీయ మజ్జూర్ యూనియన్ నాయకులతో పాటు అత్యధికంగా మహిళా పాల్గొన్నారు.



