Thursday, July 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపుస్తక రూపంలో'35- చిన్న కథ కాదు స్కీన్ ప్లే

పుస్తక రూపంలో’35- చిన్న కథ కాదు స్కీన్ ప్లే

- Advertisement -

2024 సంవత్సరానికి గాను '35 - చిన్న కథ కాదు' చిత్రం ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్‌దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడు విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు జాతీయ చలన చిత్ర పురస్కారాల్లోనూ తన సత్తా చాటింది. ఈ సందర్భంగా '35 - చిన్న కథ కాదు' స్కీన్ ప్లే పుస్తకాన్ని ఆవిష్కరించారు. దర్శకుడు నందకిశోర్ మాట్లాడుతూ,'2018లో '35 - చిన్న కథ కాదు ఒక ఆలోచనతో మొదలైంది. 2026కి ఇక్కడివరకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పడిన కష్టం, దాన్ని దాటుకుని వచ్చిన అనుభవం… కాలం గడిచే కొద్దీ మధుర జ్ఞాపకంగా మారు తుంది. ఇక్కడివరకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

నేషనల్ అవార్డ్ జ్యూరీకి, భారత ప్రభుత్వానికి సవినయంగా నమస్కరిస్తున్నాను. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పుస్తకంగా ప్రచురించడం కూడా చాలా ఆనందంగా ఉందిఅని తెలిపారు. 'రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారు అంటే, ఈ సినిమా చేసిన మ్యాజిక్ అది అని హీరో విశ్వదేవ్ చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ మాట్లాడుతూ,’ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాలోనే మోస్ట్ సీనియర్స్ భాగ్యరాజ్, గౌతమితో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. జాతీయ అవార్డు రావడం మరింత ఆనందంగా ఉందిఅని తెలిపారు. 'ఈ సినిమా చాలా సహజంగా అనిపించింది. మనం ఉంటున్న ఇల్లు, మనుషులు, వారి జీవి తాలనే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అలాంటి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. దర్శకుడు నందు చాలా సహజంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు అని దర్శకుడు వినోద్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -