Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ కు వెళ్ళే కాలువకు భూ సర్వే

లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ కు వెళ్ళే కాలువకు భూ సర్వే

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి లక్ష్మదేవిపల్లి రిజర్వాయర్ కు వెళ్ళే కాలువకు సంబంధించిన భూసేకరణ భూముల సర్వే సర్వేయర్ రాంచంద్రయ్య, నీటిపారుదలశాఖ అధికారులు సాయి సిబ్బంది కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగే భూముల సర్వే కు ముందే సర్వే నెంబర్ ల ప్రకారం ఉన్న రైతులు సర్వే కు వచ్చి ఎవరెవరి భూమి ఎంతెంత పోతుందో సంబంధించిన వివరాల అధికారులను కోరారు. తమ భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యన్మంగండ్ల సర్పంచ్లు రంజిత్ గౌడ్ ,రవి, ఉపసర్పంచ్ హన్మంతు, నాయకులు బంగ్ల రవి, భూపాల్ రెడ్డి, కృష్ణ గౌడ్ నర్సింహులు జైపాల్ రెడ్డి హన్మంతు రవిందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -