Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే

- Advertisement -

కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు,
పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌), ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్‌ ‌చేశాయి. నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బనాయించిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య పార్క్ వద్ద ఆయా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి ప్రధాన బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్‌, మంతర్‌ ‌వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల పై పాశవికంగా దాడులు చేయటం దుర్మార్గమని విమర్శించారు. వారిపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లేదంటే విద్యార్థుల పోరాటం దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని వారు హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను పక్క దేశాలతో పోల్చుతూ ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి గోదిమీడియా ప్రయత్నిస్తుందని విమర్శించారు. సమస్యలను పరిష్కరించలేని నియంతలే ఉద్యమాలను పక్కదోవ పట్టిస్తారని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. వందలాది మంది విద్యార్థుల తలలు పగిలి రక్తం పారుతుంటే, ఆ వీడియోలను చూసే సమయం లేదంటూ వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. అత్యున్నత న్యాయ స్థానమే అన్యాయాన్ని బలపరిచేదిగా వ్యవ హరిస్తే దేశంలో సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల ఆందోళనకు వారు పూర్తి సంఘీ భావం తెలిపారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్య త్తుతో ప్రధాని మోడీ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నగర కార్యదర్శి బి సుబ్బారావు, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం రమేష్, సీఐటీయూ నగర ఉపా ధ్యక్షులు జి రాములు, ఆల్ పెన్షనర్స్ అసోసి యేషన్ రాష్ట్ర నాయకులు పి కృష్ణమూర్తి, ఎం నరహరి, ఎన్ బి చారి, కృష్ణా రావు, శ్యాం మోహన్, నాయకులు ప్రశాంత్ అర్జున్, కిషన్, చెన్నయ్య, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -