Homeతెలంగాణ రౌండప్అధిక ధర విక్రయించిన డీలర్‌కు షోకాజ్ నోటీసు

అధిక ధర విక్రయించిన డీలర్‌కు షోకాజ్ నోటీసు

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

యూరియా ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు విక్రయించిన ఎరువుల డీలర్‌కు శనివారం మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ  రైతుల నుండి అందిన ఫిర్యాదుల ఆధారంగా, ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర) కంటే అధిక ధరకు యూరియా విక్రయించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సంబంధిత ఎరువుల డీలర్‌కు నోటీస్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 1985 మరియు సంబంధిత నిబంధనల ప్రకారం, నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరకు ఎరువులు విక్రయించడం చట్టవిరుద్ధమన్నారు .ఈ విషయమై డీలర్ తన వివరణను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆదేశించారు. సమర్పించే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం లైసెన్స్ సస్పెన్షన్/రద్దు సహా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. రైతులు ఎవరైనా ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు ఎరువులు విక్రయించినట్లు గమనించినట్లయితే సంబంధిత ఆధారాలతో వ్యవసాయ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -