Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తొలి ఏకాదశి.. భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

తొలి ఏకాదశి.. భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
శనివారం తొలి ఏకాదశి సందర్భంగా మద్నూర్ మండలంలోని గ్రామాలలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలను సందర్శించి ఉపవాస దీక్షలతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ లోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఈ ఆలయానికే కాకుండా మండల కేంద్ర పరిధిలోని సోమలింగాల గుట్ట ఆలయం, విఠలేశ్వర ఆలయం, బీర్కూరు మండల ప్రాంతంలో గల తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయం, బైరాపూర్ విఠలేశ్వర ఆలయాలలో భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -