- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట గ్రామ విద్యార్థుల రవాణా సమస్యను దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ బస్ డిపో మేనేజర్‌ను కలిసి సమస్యను వివరించడంతో స్పందించిన ఆర్టీసీ అధికారులు శనివారం నుంచి రాజంపేటకు లోకల్ బస్సు సేవను ప్రారంభించారు. కామారెడ్డి నుంచి ఉదయం 8:00 గంటలకు, రాజంపేట నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్‌కు గ్రామస్తులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



