Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ నాయకులతో ఎస్ఐఆర్ పై సమీక్ష

బీఆర్ఎస్ నాయకులతో ఎస్ఐఆర్ పై సమీక్ష

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిపై బిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నాయకులతో శనివారం సమీక్ష సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కంప గోవర్ధన్ నిర్వహించారు. మండలంలో ఈఎఫ్ ఫారమ్‌ల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తైందని, మిగిలిన ఫారమ్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి మినహాయించకుండా కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలో పార్టీ కార్యకర్తలు బిఎల్ఓలకు సహకరించాలని నిర్ణయించారు. ప్రతి బూత్‌లో 100 శాతం లక్ష్యం సాధించే వరకు ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులకు తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -