Sunday, July 26, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్మాయదారి జల్లెడ

మాయదారి జల్లెడ

- Advertisement -

కావలసిన వస్తువులు: పారదర్శక గ్లాస్‌, ఫుడ్‌ కలర్‌, నీరు, జల్లెడ
ప్రయోగం చేయు విధానం : ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా! ఈ ప్రయోగానికి మనము పారదర్శకమైన గ్లాస్‌, రంగు నీళ్లు, జల్లెడ తీసుకోవాలి. గ్లాస్‌లో రంగు నీళ్లు నింపి, దానిపై జల్లెడను ఉంచాలి. అనంతరం జల్లెడపై కుడిచేతిని ఉంచి, గ్లాస్‌ను జాగ్రత్తగా తలకిందులుగా తిప్పాలి. తరువాత గ్లాస్‌ను పట్టుకున్న ఎడమ చేతిని తీసి జల్లెడను పట్టుకోవాలి. ఆ తర్వాత జాగ్రత్తగా కుడిచేతిని తీసి, కుడిచేతితో జల్లెడను పట్టుకొని గమనించండి.
ప్రయోగ వివరణ: ఈ ప్రయోగంలో నీళ్లు నింపిన గ్లాసును తలకిందులుగా ఉంచినప్పటికీ, జల్లెడ నుండి నీరు బయటికి రాదు. నీటికి ఉన్న తలతన్యత కారణంగా జల్లెడపై నీరు ఒక పొరలా ఏర్పడి, జల్లెడ యొక్క సన్నని రంధ్రాలను మూసివేస్తుంది. అందువల్ల నీరు బయటికి రాదు. ఇందులో గాలి యొక్క ఊర్ధ్వ పీడనం కూడా తోడ్పడుతుంది.
నిత్యజీవితంలో ఉదాహరణ: కొన్ని కీటకాలు నీటిపై మునగకుండా నడవడానికి నీటి తలతన్యత కారణం.

వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్‌ పాపులరైజర్‌, 9640053470

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -