Sunday, July 26, 2026
E-PAPER
Homeకవితలాఠీ ఛార్జ్

లాఠీ ఛార్జ్

- Advertisement -

లాఠీ ఛార్జ్ అంటున్నారు…

వాళ్లు లాఠీలతో ఛార్జ్ చేయాలనుకుంటున్నారు,
రెండు దెబ్బలు పడితే పర్వాలేదు,
ఎన్ని దెబ్బలైనా పడ్డా పర్వాలేదు.

కానీ…
ఒక్కసారి నీ అవమానాలన్నీ,
అరికాళ్ల నుండి తలపై దాకా గుర్తు తెచ్చుకో.

నిన్ను చిన్నచూపు చూసిన చూపులను గుర్తు చేసుకో,
నీ కష్టాన్ని కించపరిచిన మాటలను గుర్తు చేసుకో,
నీ చెమటకు విలువ ఇవ్వని సమాజాన్ని గుర్తు చేసుకో.

ఆ తర్వాత…
లాఠీ కాదు, నీ ఓటుతో ఛార్జ్ చేయ్!

ఒక్క ఓటు…
ఒక్క బటన్ నొక్కడం కాదు,
అది నీ ఆత్మగౌరవానికి ఇచ్చే సమాధానం.

నీ ఓటు వేళ్లపై పడే సిరా చుక్క,
నీ జీవితాన్ని మార్చే మెరుపు కావాలి.
నీ మౌనం చెదిరి,
నీ హక్కు మాట్లాడే రోజు రావాలి.

లాఠీ దెబ్బలతో శరీరం మాత్రమే నొప్పిస్తుంది,
కానీ ఓటు దెబ్బతో వ్యవస్థ కదులుతుంది.

ఎన్ని సంవత్సరాలుగా నిన్ను మోసం చేశారో గుర్తు చేసుకో,
ఎన్ని హామీలు ఇచ్చి మర్చిపోయారో గుర్తు చేసుకో,
నీ కన్నీటి చరిత్రను ఒక్కసారి చదువు.

ఆ తర్వాత…
నీ ఓటును ఆయుధంగా మార్చు.

అప్పుడు వస్తుంది పవర్…
కరెంట్‌లా కాదు,
ప్రజాస్వామ్యం ఇచ్చే నిజమైన పవర్!

నీ చేతిలోని ఓటు పెట్టె,
రాజులను సృష్టించగలదు,
రాజ్యాలను మార్చగలదు,
చరిత్రను తిరిగి రాయగలదు.

అందుకే…

లాఠీ ఛార్జ్‌కు భయపడకు,
ఓటు ఛార్జ్‌కు సిద్ధపడు!

అప్పుడు నీలోకి వచ్చే పవర్,
ఒక్క మనిషిని కాదు,
ఒక తరం భవిష్యత్తును వెలిగిస్తుంది.

— అందె డప్పు భాస్కర్ ఉస్తాద్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -