1
అనగనగా ఓ రోజు కథలు
ముసలితనమే లేదు
నేటి యువకుడికి
2
సాయంత్రం
అలసిపోయి సేద తీరింది
కొండవతల
3
ఆకరి చూపు
అసలు అర్థం
ఆర్ద్రతే
4
ఆరిపోయిన దీపం మీద
వెలుగుతున్న దీపమే
మరణం
5
నిటారుగా పెరిగింది
అంతస్తులను చూస్తూ
సిటీలో చెట్టు
6
గాలివాన
గుడిసె నెత్తుకపోయాయి
బిగ్గరగా నవ్వారు ఇంటిల్లపాది
7
అవ్వ మీద
వాన వలపోత
గుడిసెంత నిండిపోయింది
8
కాలం
కలలన్నింటినీ వేరుచేసి
ఉరితీసింది
9
పళ్లెంలో రూపాయి
పిల్లోడిలా అల్లరి చేస్తూ
వెక్కిరిస్తుంది
10
భయం
నగరంలోకొచ్చిన పులిలా
అందరినీ వెంటాడుతుంది
11
ఆకాశానికేసి చూశాడు
హదయం నిండా
శూన్యం
12
వానలు
ఋతువులో కంటే
మనసులోనే ఎక్కువ కురిసాయి
13
రాత్రి విషాదానికి
ఓదార్పునిచ్చింది
కుక్క అరుపు
14
అల్లారం లేకుండా తెల్లారే లేచానని
గర్వంగా చెప్పుకుంటుంది
గుడిసె పై ఎక్కి కోడి
15
రాయి
బావిలోకి దూకింది
లోతెంతో లెక్కపెట్టడానికి
16
చీకటి
బూచోడికి భయపడి
పాప కళ్ళకింద నిద్రపోయింది
పి. సుష్మ మక్తల్
9959705519
హైకులు
- Advertisement -
- Advertisement -



