Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో అబ్దుల్ కలాం వర్ధంతి సభ

ఆలేరులో అబ్దుల్ కలాం వర్ధంతి సభ

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను 
భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సభ ఆలేరు పట్టణంలో సోమవారం రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కలలు కనండి ,కలలను సాకారం చేసుకోండి, అనే నినాదాన్ని, విద్యార్థులకు తెలియజేసిన మహా మేధావి అని అన్నారు. ముందుగా ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణకు భూమి పూజ నిర్వహించడం జరిగింది.

అబ్దుల్ కలాం జయంతి అక్టోబర్ 10 నాటికి విగ్రహావిష్కరణ  పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగ నరసింహులు ,పులి పలుపుల మహేష్ , 3,4 వార్డుల కౌన్సిలర్లు యాట శివ, బీజని కళ్యాణి మధు, మాజీ వార్డు మెంబర్లు పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, మోతి వెంకటేష్, మాజీ ఎంపిటిసి కట్టే గుమ్ముల సాగర్ రెడ్డి, జర్నలిస్టులు ఎండి కుర్షద్ పాషా, ఎర్ర జాన్సన్ వివిధ ప్రజా సంఘాల నాయకులు కంతుల శంకర్, ఏలుగుల వెంకటేష్, ఎండి ఫయజ్, పడగంటి చందు మైదము భాస్కర్, పేరపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -