- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24వ తేదీన కేటీఆర్ జన్మదినం సందర్భంగా గణేష్ బిగాల వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో, ఈరోజు స్వయంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని గణేష్ బిగాల ఆకాంక్షించారు.
- Advertisement -



