Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతీ ఒకరు అబ్దుల్ కాలం అడుగుజాడల్లో నడవాలి 

ప్రతీ ఒకరు అబ్దుల్ కాలం అడుగుజాడల్లో నడవాలి 

- Advertisement -

రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం
నవతెలంగాణ-సదాశివ నగర్

మిస్సైల్ మ్యాన్, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని సోమవారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స.హా చట్టంరాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందాన్నారు.

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి మాట్లాడుతూ.. భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి చేసిన కృషిని కొనియాడారు. ప్రతి భారత పౌరుడు అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడుస్తూ, కలాం జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం. ఏ సలీం, జిల్లా వక్త న్యాయవాది ఈక శ్రీనివాసరావు, జిల్లా మహిళా కార్యదర్శి యు. భాగ్యలక్ష్మి, జిల్లా సలహాదారులు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా,నితిన్ గౌడ్, కాసర్ల లింగం, చాకలి లింగం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -