Monday, July 27, 2026
E-PAPER
Homeఖమ్మంమదర్ థెరెస్సా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మదర్ థెరెస్సా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి మండలం కొత్తూరులోని మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో టీజీడీఈసెట్ (టీజీ డీ.ఈఎల్.ఈడీ) 2026–28 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు పొందేందుకు ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్వీఆర్ దీక్షితులు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో తెలుగు మాధ్యమంలో అర్హత సాధించి, ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన  (సర్టిఫికెట్ వెరిఫికేషన్) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

​ఈ నెల 30న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ కళాశాలకు విద్యార్థులు తమ అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో నిర్దేశిత సమయానికి హాజరుకావాల్సిందిగా ప్రిన్సిపాల్ దీక్షితులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -