Monday, July 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ పరామర్శ

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: గుండెపోటుతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లు ఉన్నారు.ఆసుపత్రి వైద్యులను కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేసీఆర్, ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పరామర్శ అనంతరం కేసీఆర్ తిరిగి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -