Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ సిక్కం భూమిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ సిక్కం భూమిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– ఉప్పునుంతల తహసీల్దార్‌కు జప్తి సదగోడు గ్రామ సర్పంచ్ భీంపాకుల గెల్వమ్మ వినతి
నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం జప్తి సదగోడు గ్రామంలోని సర్వే నంబర్ 143లో ఉన్న ప్రభుత్వ సిక్కం భూమిలో చేపడుతున్న అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ భీంపాకుల గెల్వమ్మ మండల తహసీల్దార్ అద్దంకి సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న కుమ్మరి కుంట పరిధిలోని ప్రభుత్వ సిక్కం భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేసి తొలగించాలని ఆమె కోరారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు వెంటనే స్థల పరిశీలన నిర్వహించి, ఆక్రమణలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ సింగ్, వెంకటయ్య, మాజీ సర్పంచ్ పద్మశ్రీహరి, సుధాకర్ రెడ్డి, బాలకాశన్న, అంజయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -