Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంఆరు పాయింట్ల ఫార్ములాపై ఆరా ..

ఆరు పాయింట్ల ఫార్ములాపై ఆరా ..

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ సమావేశం
హాజరైన సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాష్ట్రంలో పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణం,
సంస్థాగత అంశాలపై సమాలోచనలు 
తెలంగాణలో చేపడుతున్న కార్యక్రమాలపై అధిష్ఠానానికి వివరణ
పలు అంశాలపై నివేదిక అందజేసిన
 పీసీసీ అధ్యక్షుడు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్దేశించిన ఆరుపాయింట్ల ఫార్ములాపై తెలంగాణకు చెందిన నాయకులతో ఏఐసీసీ చర్చించింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌లు సమావేశం అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం, ఎస్‌ఐఆర్ అమలు తీరు వంటి కీలక అంశాలపై దిల్లీలో సమీక్ష నిర్వహించారు.

తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం, ఎస్‌ఐఆర్ అమలు తీరు, క్షేత్రస్థాయి పార్టీ కార్యకలాపాలపై రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి వివరించింది. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలను కేసీ వేణుగోపాల్‌కు తెలిపారు. పార్టీ బాధ్యతల అప్పగింత, శిక్షణ కార్యక్రమాలు, సంస్థాగత క్రమశిక్షణ, సమావేశాల నిర్వహణ, అనుసంధాన కేంద్రాల పనితీరు సమీక్ష, కాంగ్రెస్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వినియోగం వంటి అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమగ్ర నివేదికను అధిష్ఠానానికి సమర్పించారు.

పార్టీ బలోపేతానికి చేపడుతున్న చర్యలపై చర్చ
ఈ సమీక్షలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడంపై అధిష్ఠానం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ కీలక సమీక్ష నిర్వహించింది. అదేవిధంగా తెలంగాణలో పార్టీ బలో పేతానికి చేపడుతున్న చర్యలు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్-ఎస్‌ఐఆర్ అమలు తీరు, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై గంటకు పైగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఏఐసీసీ అన్ని రాష్ట్రాలకు సూచించిన ఆరు అంశాల కార్యాచరణ-6-పాయింట్ ఫార్ములా అమలు పురోగతిని కూడా కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. పార్టీ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవం తంగా అమలు చేయాలని నేతలకు ఆయన సూచించినట్టు తెలిసింది. కాగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -