టెహ్రాన్ : అమెరికా దాడులు ఆపినంత కాలం తాము కూడా దాడులు చేయబోమని ఇరాన్ తెలిపింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘దాడులకు దాడులు’ అనేది తమ విధానమని చెప్పారు. అమెరికా కనుక దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని, ఇదే విషయాన్ని వాషింగ్టన్‌కు తెలియజేశామని అన్నారు. కాగా దౌత్యానికి మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాడులు ఆపేయాలని ట్రంప్ నిర్ణయించారని ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ తెలిపారు. ట్రంప్ కొంత సమయం ఇస్తున్నారని ఆయన అన్నారు. అయితే అంతకు మించి వివరాలు వెల్లడించలేదు.
ఇరాన్ హెచ్చరికలు బేఖాతరు
టెహ్రాన్ : హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే దారిలో ప్రయాణిస్తున్న ఓ చమురు నౌక సముద్రంలో అమర్చిన మందుపాతరను ఢీకొట్టింది. ఈ ఘటనతో నౌకలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఇరాన్ అధికార తస్నిమ్ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం…చమురు నౌక హార్ముజ్‌లో ఇరాన్ అధికారులు నిర్దేశించిన దారిలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణిస్తూ మందుపాతరను ఢీకోంది. అయితే ప్రాణనష్టానికి సంబంధించి కానీ, పేలుడు కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి కానీ సమాచారమేదీ తెలియలేదు. చమురు నౌక ఏ దేశానికి చెందినదో కూడా తెలియడం లేదు. తమ సైన్యం సూచించిన మార్గాలలో ప్రయాణించే నౌకలను మాత్రమే హార్ముజ్‌లో అనుమతిస్తామని గత నెల 26న ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
అమెరికా దాడులు ఆపితే మేమూ ఆపుతాం : ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



