Thursday, March 19, 2026
E-PAPER
Homeబీజినెస్యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరగొచ్చు

యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరగొచ్చు

- Advertisement -

సీఈఏ అనంత నాగేశ్వరన్‌
న్యూఢిల్లీ :
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్‌లో ద్రవ్యోల్బణం ఎగిసిపడటానికి కారణం కానున్నాయని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి అనంత నాగేశ్వరన్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావంపై ఆయన పార్లమెంటరీ కమిటీకి కీలక వివరాలు వెల్లడించారు. ముడిచమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల వరకు ఉంటే దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం స్వల్పమేనన్నారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా చమురు ధరలు 130 డాలర్లకు చేరుకుని.. రెండు మూడు త్రైమాసికాల పాటు అలాగే కొనసాగితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.5 శాతానికి ఎగబాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదే పరిస్థితి తలెత్తితే భారత జీడీపీ వద్ధి రేటు 6.4 శాతానికి పడిపోవడమే కాకుండా, కరెంట్‌ అకౌంట్‌ లోటు జిడిపిలో 3.2 శాతానికి పెరిగి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకురావచ్చని నాగేశ్వరన్‌ విశ్లేషించారు. మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ పతనం కావడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.9 ట్రిలియన్‌ డాలర్లుగానే ఉందని.. దీనివల్ల 2026-27 నాటికి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యం సవాలుతో కూడుకున్నదేనని నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -