Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైడ్రా కమిషన‌ర్‌ను వెంటనే తొలగిచాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తు న్నామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మాట్లాడుతూ పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పారు. హైడ్రా చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్‌పై ఉండటం ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతోందని విమర్శించారు. నాడు హిట్లర్ యూదులను నిర్మూలిస్తే నేడు రేవంత్ రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను తొలగిస్తున్నారని అన్నారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశామన్నా‌రని గుర్తు చేశారు. లోతుకుంట, బహదూర్ గూడ, అమీన్ పూర్‌లో హైడ్రా చేసిన అరాచకాల చిట్టా పెద్దదని వివరించారు. హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిందే హైడ్రాఅనీ, రేవంత్‌‌రెడ్డికి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని చెప్పారు. ఇది కూల్చివేతల ప్రభుత్వమని విమర్శించారు. పేదలకో న్యాయం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లుకో న్యాయమా?అని ప్రశ్నించారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్ రియల్ దందాలు చేస్తున్నారని చెప్పారు. హైడ్రాను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని హైకోర్టు అన్నదంటే రాష్ట్రంలో పాలన ఉందా?అని అడిగారు. రంగనాథ్‌ను అరెస్టు చేయాల్సింది హైకోర్టు కొంత దయ చూపిందని అన్నారు. ఈరోజు రంగనాథ్ రేపు డీజీపీ, తర్వాత సీసీఎల్ఏ కోర్టు గుమ్మం ఎక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు. రంగనాథ్ పోయి వేరే అధికారి వచ్చినా రేవంత్ తీరు మారక పోతే హైడ్రా తీరు మారదని అన్నారు. అధికారులు కూడా రూల్ బుక్‌‌ను ఫాలో కావాలని సూచించారు. ఎవరైనా చట్ట ప్రకారమే ఉద్యోగం చేయాలన్నారు. తప్పు చేసిన అధికారులపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చర్యలుంటాయని హెచ్చరించారు. అన్ని దస్త్రాలనూ శోధిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే హైడ్రాను రద్దు చేస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రకటించా‌రని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -