Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలి

ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలి

- Advertisement -

ఆర్టీసీ డిపోల దగ్గర ధర్నాలో ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌
విజయవంతం చేసిన కార్మికులకు నేతల అభినందనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిది-హైదరాబాద్‌

ఆర్టీసీ ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌- సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్‌ ‌చేశారు. అనంతరం స్థానిక డిపో మేనేజర్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులకు కార్యకర్తలకు ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వి.ఎస్.రావు అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం వేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ యూనియన్లతో చర్చించి పలు అంశాలను అంగీకరించిందనీ, రెండు నెలలు కావస్తున్న పేస్కేలు తప్ప, ఏ ఒక్క అంశము కూడా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ఉద్యోగ భద్రతపై కమిటీని వెంటనే నియమించాలని సూచించారు. అలవెన్స్ లు 80 శాతం పెంచుతామని మూడు నెలల క్రితమే అంగీకరించిన ఇంతవరకు అమలు జరగలేదన్నారు. నెలకు మూడు కోట్లకు పైగా కార్మికులు నష్టపోతున్నారనీ, తక్షణమే అమలుకు ఆదేశాలివ్వాలన్నారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో అపాయింట్ అయిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. మహబూబ్‌‌నగర్‌ డిపో వద్ద జరిగిన ధర్నాలో SWF అధ్యక్షులు వీరాంజనేయులు హాజరై ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. ఖమ్మం డిపో వద్ద ఉప ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, నల్లగొండ డిపో వద్ద కోశాధికారి సత్తిరెడ్డి, మణుగూరు వద్ద ఉపాధ్యక్షులు రాంబాబు, మధిర డిపో వద్ద పద్మావతి, సూర్యాపేట డిపో వద్ద బత్తుల సుధాకర్, వరంగల్-1 డిపో వద్ద ఉపేంద్ర చారి, జగిత్యాల డిపో వద్ద శ్రీనివాస్, బర్కత్‌‌పుర వద్ద చంద్ర ప్రకాష్, జీడిమెట్ల డిపో వద్ద కె. గీత, రాజేంద్రనగర్ డిపో వద్ద రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -