- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల బ్లాక్-1 ఓసీపీకి డేంజర్ జోన్లో 500 మీటర్ల దూరంలో భూసేకరణ ప్రక్రియ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో 17-12- 2022 ప్రిలిమినరి నోటిఫికేషన్ (పిఎన్) ప్రకారం ఐదు సర్వే బృందాలు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సర్వే చేస్తున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం మొత్తం జాబితాలో 2,265 ఇండ్లను గుర్తించారు. మంగళవారం వరకు ఐదు టీమ్స్ కలిపి 794 ఇండ్ల సర్వే పూర్తీ చేసినట్లుగా తహశీల్దార్ రవికుమార్ వెల్లడించారు.
- Advertisement -



