మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి
నవతెలంగాణ – మిడ్జిల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి పోషించిన పాత్ర ఎంతో కీలకమైందని, రాజకీయాలలో నిజాయితీగా భారతదేశానికి సేవలందించిన మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సేవలు మరువలేనివని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గోపాల్ రెడ్డి విగ్రహం ఎదుట జైపాల్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజు తో కలిసి పూలమాలు లేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి అల్వాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాలలో నిస్వార్ధంగా పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, బాలయ్య, విజయ్, కుమార్, సంపత్ కుమార్, సాయిలు బుచ్చయ్య, శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, దానియేలు, వెంకటేష్ గౌడ్, భాస్కర్ నాయక్, భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, శ్రీశైలం యాదవ్, రాములు, కృష్ణ యాదవ్, ఉస్మాన్, పర్వతాలు, మల్లయ్య, బీరయ్య,బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
జైపాల్ రెడ్డి సేవలు మరువలేనివి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



