• కాంగ్రెస్ తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం
• ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సుడిగాలి పర్యటన
• రూ. 4.61 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ -పెద్దవంగర
పెద్దవంగర మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుతానని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన ఎమ్మెల్యే, రూ. 4.61 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్, సీనియర్ నాయకులు ముద్దసాని సురేష్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. సీసీ రోడ్డు, రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ శ్రీనివాసులు, ఏఈ దయాకర్, ఎంపీడీవో సురేష్, తహశీల్దార్ వినోద్ కుమార్, ఎంఈవో శ్రీనివాస్, మండల నాయకులు సైదులు గౌడ్, గోపాల్ నాయక్, రవీందర్ రెడ్డి, నెహ్రు నాయక్, దుంపల కుమారస్వామి, దాసరి శ్రీనివాస్, చిలుక దేవేంద్ర, హరికృష్ణ, మహేష్, వినోద్, రాజశేఖర్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



