నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ టెలికాం సంస్థ ‘Vi’కి చెందిన కంటెంట్ అగ్రిగేషన్ ప్లాట్‌ఫారమ్ ‘Vi మూవీస్ అండ్ టీవీ’ ఒక సరికొత్త వాల్యూ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒకే రీఛార్జ్‌తో 20 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, 200కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు మరియు 30జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందిస్తోంది.
28 రోజుల వ్యాలిడిటీతో కేవలం రూ.200 ధరకే ఈ కొత్త ‘Vi మూవీస్ అండ్ టీవీ’ ప్రిపేడ్ ప్యాక్ లభిస్తోంది. ప్రతి ఓటీటీకి విడివిడిగా సబ్‌స్క్రిప్షన్లు తీసుకునే అవసరం లేకుండా, చాలా కేబుల్ టీవీ లేదా డీటీహెచ్ సేవల నెలవారీ ఖర్చు కంటే తక్కువ ధరకే వినియోగదారులకు నాణ్యమైన వినోదాన్ని అందించేలా ఈ ప్లాన్‌ను రూపొందించారు.
వినియోగదారులు ఒకే సమయంలో అనేక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను మేనేజ్ చేయడం ఇబ్బందిగా మారుతున్న తరుణంలో, ఈ కొత్త ప్యాక్ ఒకే రీఛార్జ్‌తో విస్తృతమైన వినోదాన్ని అందిస్తూ వేర్వేరు చెల్లింపుల తలనొప్పిని తప్పిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా జియో హాట్ స్టార్, SonyLIV, ZEE5, Lionsgate Play, ShemarooMe, మనోరమమ్యాక్స్, FanCode, Playflix, Klikk, Atrangii, Chaupal, OTTplay Live, Pocket Films, YuppTV, Addatimes, Kanccha Lannka, TimesPlay, NextGTV వంటి అనేక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను సులభంగా వీక్షించవచ్చు.
మొత్తం 16 భాషల్లో కంటెంట్‌ను అందిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రేక్షకుల ఇష్టాటోష్టాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వినోదాన్ని ఒకే సబ్‌స్క్రిప్షన్ కింద Vi మూవీస్ అండ్ టీవీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ భారీ కంటెంట్ లైబ్రరీతో పాటు, ఈ ప్యాక్‌లో 30జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా లభిస్తుంది. దీనివల్ల వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణాల్లో కూడా తమకు నచ్చిన కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.ప్రీమియం ఓటీటీ కంటెంట్, 200కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు మరియు డేటా ప్రయోజనాలను ఒకే రీఛార్జ్‌తో అందిస్తూ, Vi మూవీస్ అండ్ టీవీ డిజిటల్ వినోదాన్ని వినియోగదారులకు మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా మరియు తక్కువ ధరలోనే తీసుకొస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మొత్తం నాలుగు పరికరాల్లో (డివైజ్‌లలో) వినోదాన్ని పొందే వీలుంది. అంతేకాకుండా SonyLIV మినహా మిగిలిన అన్ని ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే సమయంలో రెండు స్క్రీన్‌లపై తమకు నచ్చిన కంటెంట్‌ను వినియోగదారులు చూసుకోవచ్చు.



