Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి ఆర్థిక చేయూత 

మృతురాలి కుటుంబానికి ఆర్థిక చేయూత 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన ముప్పిడి గోపమ్మ కుటుంబానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ సహకారంతో బుధవారం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పడంతో పాటు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్టార్విన్, బీఆర్ఎస్ ఆలేరు మండల బీసీ సెల్ అధ్యక్షుడు బండి నరేందర్ గౌడ్, సోషల్ మీడియా కో-కన్వీనర్ బండి రాజు గౌడ్, పాల సంఘం చైర్మన్ నరసింహ, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు వంగ శంకరయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -