నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని మద్నూర్, రాచూర్, పెద్ద తడగూర్, పెద్ద షక్కర్గా గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు పాలకవర్గం సభ్యులు సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగ చేపడుతున్నారు. మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో తడి చెత్త ,పొడి చెత్త, శానిటేషన్ చెత్త, ప్రత్యేక చెత్త, ఇలా నాలుగు రకాల గ్రామ శుభ్రత కోసం గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి నాలుగు రకాల డ్రమ్ములను ప్రారంభించారు. మండలంలోని రాచూరు గ్రామంలో గ్రామ పరిసరాల పరిశుభ్రత కోసం ఆ గ్రామ సర్పంచ్ లోకండే ఆకాష్ గ్రామంలోని వాడవాడల్లో గడ్డి మందు పిచికారి చేయిస్తున్నారు.
పెద్ద షక్కర్గా గ్రామంలో ఇంటింటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమంలో మండల ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి కూడా పాల్గొన్నారు. పెద్ద తడుగూరు గ్రామంలో వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వితంతువులకు ఆ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విధమైన గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలను ఆయా గ్రామాల సర్పంచులు పాలకవర్గం సభ్యులు గ్రామ కార్యదర్శులు చేపట్టారు.



