Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిఎల్పిఓ, ఎంపీడీవోలను సన్మానించిన సర్పంచులు

డిఎల్పిఓ, ఎంపీడీవోలను సన్మానించిన సర్పంచులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూరు మండలంలోని పెద్ద షాక్కర్గా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రామ్ పటేల్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు మొక్కల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మండల ఎంపీడీవో సత్యనారాయణరెడ్డిని గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా సన్మానించారు. అదేవిధంగా మండలంలోని తడి హిప్పరుగా గ్రామానికి సందర్శించిన బాన్సువాడ డివిజనల్ డీఎల్పిఓ ప్రసాద్ రావు మద్నూర్ మండల ఎంపీడీవో సత్యనారాయణరెడ్డిని సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నాతో పాటు ఉపసర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు సంయుక్తంగా సన్మానించారు. అనంతరం సన్మానించిన సర్పంచులకు అధికారులు అభినందనలు తెలియజేశారు. ఆయా గ్రామాల్లో గ్రామ కార్యదర్శిలు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -