Thursday, July 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓసీ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఓసీ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

- Advertisement -


రోజుకు 10 వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం
నవతెలంగాణ -కోల్ బెల్ట్

​జయశంకర్-భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియాలో రెండు రోజులుగా కుస్తున్న వర్షం కారణంగా కేటీకే ఓపెన్ కాస్ట్ -2,3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక రోజుకు ఓసి-2 గనిలో మూడు షిఫ్టులల్లో కలిసి 4,630 టన్నులు, ఓసి -3 గనిలో మూడు షిఫ్టులు కలిసి 5,185 టన్నులు, మొత్తంగా ఒక రోజుకు సుమారు పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. రెండు రోజుల వర్ష ప్రభావంతో సుమారు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఒకటన్ను బొగ్గు విలువ సగటున 3,500 రూపాయలు కాగా మొత్తం బొగ్గు ఉత్పత్తి విఘాతం విలువ రూ.70 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. ఇంకా వర్షం కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -