నవతెలంగాణ – బల్మూరు : మండల కేంద్రం బల్మూరులో గురువారం జరిగిన గ్రామసభ నామమాత్రంగా జరిగింది. గ్రామపంచాయతీ హాల్లో స్థానిక అంగన్వాడి టీచర్లు ఐకెపి సిబ్బంది ఒకరిద్దరు గ్రామస్తులు తప్ప గ్రామసభలో మరెవరు కనిపించకపోవడం పట్ల ఇదేమీ గ్రామ సభ అని ఆశ్చర్యపోతూ పలువురు చర్చించుకోవడం వినిపించింది. గ్రామ సభ ప్రత్యేక అధికారి సైదులు గ్రామ సర్పంచ్ శిరీష కార్యదర్శి లక్ష్మణ్ ఈజీఎస్ ఎఫ్ ఎ లింగస్వామి పాల్గొని ఎల్ నినో ప్రభావం అంశాలను చదివి వినిపించారు. గ్రామంలో ఇంకుడు గుంతలు కోటకుంటలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని తెలిపారు. గ్రామ ఉపసర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు గ్రామ సభకు ఎందుకు రాలేదు అని కార్యదర్శి ప్రత్యేక అధికారిని ప్రశ్నించగా అందరికీ గ్రామ సభకు రావాలని చెప్పినం కానీ ఎందుకో ఎవరు రాలేదు అని సమాధానం ఇచ్చారు.
గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల ను రైతులకు ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమం మండల కేంద్రం బల్మూరులో నిర్లక్ష్యానికి గురి అయితే మండలంలోని వివిధ గ్రామపంచాయతీలలో ఎలా జరిగిందో అని పలువురు చర్చించుకోవడం వినిపించింది. గ్రామ సభ పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం వార్డు మెంబర్లు కూడా హాజరు కాకపోవడం ఏమిటని గ్రామపంచాయతీ సిబ్బందిని విచారించగా గత నెలలో గ్రామ వార్డు మెంబర్ల సమావేశంలో పంచాయతీ వర్కర్లు కొందరిని తొలగించాలని తీర్మానం చేసినప్పటికీ యధావిధిగా కొనసాగుతుండడంతో నిరసనగా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ హాజరు కాలేదని అదే విషయం అయి ఉంటుందని అన్నారు. గ్రామ అభివృద్ధికి రైతుల అవగాహనకు ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన గ్రామసభ కాస్త నామమాత్రంగా కొనసాగడంతో గ్రామస్తులు నిరుత్సాహానికి గురయ్యారు. సంబంధిత జిల్లా అధికారులు ఎమ్మెల్యే స్పందించి మండల కేంద్రంలో మరోసారి గ్రామసభ నిర్వహించాలని గ్రామస్తులు పలువురు కోరారు.



