- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : వర్షపావ పరిస్థితులు అనుకూలించక రైతులు తమ పంట పొలాలను నాటుకోలేని పరిస్థితి నెలపొందని, ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటి అవకాశం ఉందని సర్పంచ్ భానుచందర్ స్పష్టం చేశారు. గురువారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభను నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ ఇండ్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలను పెంచే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నవీన్, ఉపసర్పంచ్ శ్రీకాంత్ తో పాటు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



