Thursday, July 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాల్లో చెత్తాచెదారంతో నిండిపోయిన మురికి కాలువలు 

గ్రామాల్లో చెత్తాచెదారంతో నిండిపోయిన మురికి కాలువలు 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురవడంతో రైతులు ఎంతో సంబరపడ్డారు వర్ష కాలం ప్రారంభమైనా నెల రోజులు గడుస్తున్న ఇలాంటి వర్షాలు కురావడం ఇదే మొదటిది కాబట్టి రైతుల గుండెలో సంతోషం వ్యక్తం అయింది. దింతో బుధవారం రాత్రి నుంచి ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాల్లో ఉన్న పశువులు ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంటి వద్దనే పశుగ్రాసం వేశారు అదే విదంగా కుభీర్ లోని కొన్ని కాలనిలో మురుగు నీళ్లు ప్రవహించకుండా మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి రోడ్లపై ప్రవహించడంతో గ్రామపంచాయతీ అధికారులు  సర్పంచులు గ్రామాల్లో పర్యటించి మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య  కార్మికులచే శుభ్రం చేయించారు. మురికి కాలువల ద్వారా నీటి ప్రవహించేలా చేశారు. దీంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు చెరువులు నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులకు,ప్రజలకు రాకపోకలు అంతరాయం కలగాయి.దింతో లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -