నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నవి. వర్షం కారణంగా వాహనాలు అదుపుతప్పి ఎంతోమంది మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజను మూడు నెలల్లో 10 నుంచి 15 మంది మృతి చెందుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. కార్లు ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు.
వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలని వర్షంలో వాహనాలు స్పీడుగా నడపడం కారణంగా ద్విచక్ర వాహనదారులు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. అనేకమంది ప్రమాదాల బారిన పడి చికిత్స పొందారు . రోడ్లపై బురద గుంతల కారణంగా ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి. వర్షాకాలంలో బైకులు వాహనాలపై వెళ్లేవారు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడుతో వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు..
వర్షం కురుస్తున్న సమయంలో వాహనాల వేగం పెంచడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలంలో ఆర్ టి సి బస్సులు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి అలాగే కార్లు ఇతర వాహనాలు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడు వెళ్ళద్దు. ద్విచక్ర వాహనదారులు 40 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించవద్దు. నాలుగు టైర్ల వాహనదారులు ముందు ఉండే గ్లాస్ తో పాటు హైపర్ లు సరి చూసుకోవాలి. వర్షం ఎక్కువగా కురుస్తున్న సమయంలో లైట్లు ఆఫ్ చేసుకోవాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు, కార్లు ఇతర వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టులను ధరించాలి. తప్పనిసరిగా వీల్ అలైన్మెంట్ బ్యాలెన్స్ చూసుకోవాలి. దూరప్రాంతాలకు బయలుదేరే ముందు టైర్లలో గాలి బ్రేకులు చెక్ చేసుకోవాలి.
స్పీడ్ గా వెళ్లొద్దు..వాయిస్
సత్యనారాయణ గౌడ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆర్మూర్
వర్షాకాలంలో వాహనదారులు స్పీడుగా వెళ్లొద్దు .వేగం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాహనాల కండిషన్ను చూసుకోవాలి. కార్లు, ఇతర వాహనదారులు సీటు బెల్టు ధరించడంతో పాటు బ్రేకులు, హైపర్ లు, ముందు గ్లాసులు, మిర్రర్లు, లైట్లు మంచిగా చూసుకోవాలి.
అప్రమత్తతో ఆపద దూరం..వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



