Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లిపాలు.. తల్లీబిడ్డలకు మేలు

తల్లిపాలు.. తల్లీబిడ్డలకు మేలు

- Advertisement -

రేపటి నుంచి తల్లిపాల వారోత్సవాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
తల్లిపాలు అమృతంతో సమానం..బిడ్డకు శ్రీరామరక్ష.పాలివ్వడం ద్వారా బిడ్డతో పాటు తల్లికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నాయి.ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్స వాలను నిర్వహిస్తున్నారు.కార్యక్రమాల ద్వార తల్లి పాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.

రోగనిరోధక శక్తి..
తల్లిపాలతోనే బిడ్డకు అన్ని రకాల పోషకాలు అందుతాయని,రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలు బలంగా,శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని వైద్యశాఖ అధికారులు, వైద్యులు వివరిస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలను పట్టడం వల్ల తల్లికి, బిడ్డకు ఎన్నో లాభాలు, ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో తల్లి పాల ప్రాముఖ్యత, బిడ్డకు ఎన్నిమార్లు పాలు తాగించాలని,తల్లికి పాలు పడాలంటే ఏం చేయా లనే విషయాలపై సరైన అవగాహన ఉండడం లేదు.దీంతో తల్లిపాల విశిష్టతపై ఏడు రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

ప్రయోజనాలు..
తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకు అంటు వ్యాధులు ప్రబలవు.రక్తహీనత బారిన పడకుండా శిశువు ఆరోగ్యంగా ఉండి పెరుగుదల ఉంటుంది.తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల డెలివరీ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గుతుంది.ఆరోగ్యంగా ఉండడంతో పాటు లావు కాకుండా పూర్వ బరువును తిరిగి పొందుతారు.తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత పెరుగుతుంది.జ్వరాలు వచ్చిన, టీకాలు వేసిన సమయం లోనూ పాలు ఇవ్వవచ్చు.

ఆరు నెల్లలోపు..
అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని ఆరు నెలలపాటు బిడ్డకు తల్లిపాలే తాగించాలి.తల్లిపాలు తేలికగా అరగడంతోపాటు పిల్లల భవిష్యత్ లో శ్వాసకోశ వ్యాధులు,అలర్జీలు,ఆస్తమా,చర్మవాధ్యుల నుంచి రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోష కాలు ఇస్తాయి. ప్రతీరోజు ఎనిమిది నుంచి పది సార్లు పాలు ఇవ్వవచ్చు. ఆరు నెలల పాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని, ఆహారం పెట్టవద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.గర్భిణిగా ఉన్న ప్పటి నుంచే బిడ్డ ఎదుగుదలకు పండ్లు, కూర గాయలు,పోషకాహారం, గుడ్లు, చేపలు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాగించాలి. కాన్పు కాగానే వచ్చే మొదటి చిక్కని, పసుపురంగులో ఉం డే తల్లిపాలను తగించడం ద్వారా బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

టీకా కంటే గొప్పది: వినయ్ భాస్కర్..తాడిచెర్ల పిహెచ్సి వైద్యాధికారి
దేవుడు సృష్టించిన తల్లి పా లు టీకా కంటే చాలా గొప్ప ది. తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా పనిచేస్తాయి. ఈ పాలల్లో ఎన్నో పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. తల్లి పాలు బిడ్డకు వ్యాధి నిరో ధక శక్తి పెరుగుదలకు దోహదపడుతాయి. ప్రస్తు తం పిల్లలకు పాలు పట్టే ముందు తల్లులు చేతు లను శుభ్రం చేసుకోవాలి. తల్లి పాలు బిడ్డ శారీరక, మానసిక ఎదుగదలకు దోహదపడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -