- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని గన్నోర శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ముధోల్ ఎస్సై బిట్ల పెర్సెస్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు దాడి చేయక నలుగురు పేకాట రాయుళ్లు పట్టుబడ్డారని చెప్పారు. వారి వద్ద నుంచి రూ.2,510 నగదు, పేకముక్కలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
- Advertisement -



