నవతెలంగాణ-కుభీర్
బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని డ్రీమ్ స్వచందా సంస్థ ప్రతినిధి సాయినాథ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని జుమడా గ్రామంలో బాలకార్మికుల వ్యవస్థ నిర్ములన పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామంలో ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించి గ్రామమలో బాలల విద్య హక్కు పరిరక్షణ బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే లక్ష్యంతో అంతర్జాతీయ సంస్థ చైల్డ్ లేబర్ ప్లాట్ఫారం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరు సహకరించి గ్రామంలో ఉన్న పిల్లలను బడిలో చేర్పించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ అగ్గు మారుతీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి గీత కుమార్,అంగన్వాడీ ఆశ వర్కర్స్ కార్యకర్త గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



