విద్యా అంశాలపై విస్తృత చర్చ, తీర్మానాలు
– జిల్లా శాఖ పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆగస్టు 2 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షుడు ఆకుల బాబు, కార్యదర్శి ఎగజం సాయిలు తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో విద్యా, వైజ్ఞానిక అంశాలపై విస్తృతంగా చర్చించి, పలు విద్యా సంబంధిత తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన బాధ్యులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ తదితర రాష్ట్ర నాయకులు సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కామారెడ్డిలో ఆగస్టు 2న రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



