నవతెలంగాణ-నెల్లికుదురు
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన వీరగాని మల్లేశం గౌడ్ ను నియమించినట్లు ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మద్దసానీ వెంకటేశ్వర్లు, తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ ఆదేశాల మేరకు ఈ నియామక పత్రాన్ని అందించామని అన్నారు. గతంలో చేసిన సేవను గుర్తిస్తూ ఈ నియమ గా అందించినట్లు తెలిపారు సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు కుమ్మరి కుంట్ల మౌనేందర్ జిల్లా జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మల్లేశం గౌడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



