– మెట్రిక్ టన్నుకు రూ.23,488 నిర్ణయం
– గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులకు మెరుగైన ధరలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
జులై నెలలో సేకరించిన పామాయిల్ గెలలకు మెట్రిక్ టన్నుకు రూ.23,488 చెల్లించాలని ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు శనివారం నిర్ణయించారు. జూన్ నెలలో మెట్రిక్ టన్నుకు రూ.23,783 చెల్లించగా, జులైలో రూ.295 మేర ధర స్వల్పంగా తగ్గింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పామాయిల్ గెలల ధరలు రైతులకు ఊరటనిచ్చే స్థాయిలో కొనసాగుతున్నాయి. 2025లో మే, జూన్, జులై నెలల్లో వరుసగా రూ.18,748, రూ.17,463, రూ.18,052 మాత్రమే లభించగా, ఈ ఏడాది అదే నెలల్లో రూ.23,852, రూ.23,783, రూ.23,488 లు నిర్ణయించడం గమనార్హం. మార్చి నుంచి జులై వరకు వరుసగా ఐదు నెలలపాటు మెట్రిక్ టన్ను ధర రూ.23 వేలకుపైగా కొనసాగడం రైతులకు ప్రయోజనకరంగా మారింది.
2025 – 2026 పామాయిల్ గెలల ధరల పోలిక (రూ./మెట్రిక్ టన్ను)
నెల 2025 2026
జనవరి 20,487 20,456
ఫిబ్రవరి 20,871 21,456
మార్చి 21,000 23,005
ఏప్రిల్ 20,058 23,501
మే 18,748 23,852
జూన్ 17,463 23,783
జులై 18,052 23,488



