Saturday, August 1, 2026
E-PAPER
Homeఖమ్మంవీబీ-జీ రామ్-జీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి

వీబీ-జీ రామ్-జీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి

- Advertisement -

​– సత్తుపల్లిలో ‘పెన్ డౌన్’ కార్యక్రమాన్ని చేపట్టిన ఉద్యోగులు
నవతెలంగాణ – సత్తుపల్లి

వీబీ-జీ రామ్-జీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మండల పరిధిలోని ఉద్యోగులు శనివారం ‘పెన్ డౌన్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీబీ-జీ రామ్-జీ ఉద్యోగులు మాట్లాడుతూ..ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన క్రమం తప్పకుండా వేతనాలు  చెల్లించాలని కోరారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

​తమకు తగిన ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మండల పరిధిలోని ఉద్యోగులందరూ ఏకమై ఈ ‘పెన్ డౌన్’ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ విన్నపాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో ఏపీవో ఎం. బాబు, ఈసీ ఎం. నాగశ్రీను, టీఏలు ఆర్. విజయలక్ష్మి, జి. వీరభద్రం, ఎం. వెంకటేశ్వరావు, సీఈవోలు డి. రాంబాబు, కే. సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -