పారా షాట్‌పుట్‌లో సోనమ్ రాణాకు కూడా..
జావెలిన్ త్రోలో నీరజ్‌కు రజత పతకం
నేటితో ముగియనున్న 23వ కామన్వెల్త్ క్రీడలు
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. శనివారం బాక్సింగ్ విభాగంలో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించగా.. పారా షాట్‌పుట్ ఎఫ్-57లో సోనమ్ రాణా మరో బంగారు పతకాన్ని సాధించాడు. దీంతో భారత్‌కు దక్కిన స్వర్ణ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. అలాగే మరో రెండు రజత పతకాలు బాక్సింగ్ విభాగంలో భారత్‌కు లభించగా.. పారా షాట్‌పుట్‌లో కాంస్య పతకం దక్కింది. శనివారం జరిగిన మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్లో ప్రీతి పవార్‌తోపాటు జాస్మినే లంబోరి స్వర్ణ పతకాలను సాధించారు. జాస్మినే లంబోరి మహిళల 57కిలోల విభాగం ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మిఛెలా వాల్స్‌ను ఓడించింది. తొలి స్వర్ణం అందించిన ప్రీతి కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ 3వ ర్యాంక్ క్రీడాకారిణి అయిన ప్రీతి ప్రారంభం నుంచే బలమైన పంచ్‌లతో డెల్గాడోపై ఒత్తిడి పెంచింది. దీంతో ఐదుగురు న్యాయనిర్ణేతలు 30-27పాయింట్లు కేటాయించి ప్రీతిని విజేతగా ప్రకటించారు. రెండోరౌండ్‌లో ప్రీతిపై డెల్గాడో ఒత్తిడి పెంచినా.. ప్రీతి ఏమాత్రం వెనుంకంజ వేయలేదు. మూడో రౌండ్‌లో ప్రీతికి తిరుగులేకుండా పోయింది.. దీంతో ప్రీతికి స్వర్ణ పతకం ఖాయమైంది. ఇక మహిళల 57వ విభాగంలో జస్మినే సైతం స్వర్ణం పట్టేసింది. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ వాల్ష్‌కు ఏమాత్రం అవకాశమివ్వని భారత బాక్సర్ 5-0తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్ అయిన జాస్మినే కామన్వెల్త్‌లో పసిడి గెలిచి 57 కిలోల విభాగంలో తనకు తిరుగులేదని చాటింది. వీరిద్దరూ పోడియంపై నిల్చోవడంతో నేరుగా సెమీస్ చేరిన లొవ్లీనా బొర్గోహైన్ కూడా పసిడి పోరుకు సిద్ధమైంది.
జావెలిన్ త్రోలో నీరజ్‌కు
రజతం, యశ్వీర్‌కు కాంస్యం
జావెలిన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ సాధించడంలో విఫలమయ్యాడు. శనివారం జరిగిన ఫైనల్లో నీరజ్ రజత పతకానికే పరిమితమయ్యాడు. ఈ విభాగంలో శ్రీలంకకు చెందిన రమేశ్ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయాడు. ఇక భారత్‌కే చెందిన యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఒకేసారి రెండు పతకాలు దక్కడం ఇదే తలొలిసారి. ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో సీజన్ బెస్ట్ 85.83 మీటర్ల దూరం విసిరాడు. అయితే శ్రీలంక స్టార్ రమేశ్ పతిరగె 89.75 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలిసారి ఈ క్రీడల బరిలోకి దిగిన 24 ఏళ్ల యశ్వీర్ సింగ్ చివరి ప్రయత్నంలో 85.41 మీటర్లు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే అతడి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. చివరి రౌండ్‌కు ముందు ఏడో స్థానంలో ఉన్న యశ్వీర్ ఒక్క త్రోతో మూడో స్థానానికి ఎగబాకి కాంస్యాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్ రోహిత్ యాదవ్ 81.56 మీటర్లతో ఏడో స్థానంలో నిలిచాడు.
పారా షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు దక్కాయి. శనివారం జరిగిన పురుషుల పారా షాట్‌పుట్ ఎఫ్-57 ఫైనల్లో సోనమ్ రాణా స్వర్ణ పతకం చేజిక్కించుకోగా.. శుభమ్ జుయాల్ రజత పతకం సాధించాడు. రాణా గుండును తొలి ప్రయత్నంలో 13.38విసరగా.. రెండోరౌండ్‌లో 13.40మీ. అత్యుత్తమ త్రో తో రాణించి బంగారు పతకాన్ని సాధించాడు. మూడో ప్రయత్నం ఫౌల్ కాగా.. మిగిలిన రౌండ్‌లలో 13.14మీ, 13.17మీ. 13.11మీ. విసిరాడు. ఈ సీజన్‌లోనే రాణా అత్యుత్తమ ప్రదర్శనతో రాణించాడు. ఇక రజత పతకం సాధించిన జుయల్ 13.08మీ. ప్రారంభించి 12.42మీ. మూడో ప్రయత్నంలో 13.27మీ. విసిరాడు. ఐదో, చివరి ప్రయత్నంలో ఏకంగా 13.38మీ. విసిరిన రజత పతకం సాధించాడు.. కేమరూన్‌కు చెందిన సెడ్రిక్ ఇడ్రిస్ 12.57మీ. కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు.


